కొడుకుకి ప్రేమతో

మా ఇంట పంచవసంతం చిన్ని తండ్రి నిన్ను చూడగ.. వేయి కళ్లైనా సరిపోవురా.. అన్ని కళ్లూ చూస్తుండగా.. నీకు దిష్టంతా తగిలేనురా.. ఓ సినీ కవి చెప్పిన ఈ మాటలు అక్షరసత్యం.. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రీ.. తన బిడ్డ బుడిబుడి అడుగులు చూస్తూ.. మురిసిపోతు అనుకునే మాటలు ఇవి.. ఇక నా ఫీలింగ్స్ చెప్పాలి అంటే.. ప్రతి వ్యక్తి జీవితంలో రెండు భాగాలు ఉంటాయి.. ఒకటి పెళ్లికి ముందు.. రెండోది పెళ్లికి తరువాత.. కానీ నిజాయితీగా చెప్పాలి అంటే.. నా జీవితం మాత్రం.. ఆశ్రిత్ పుట్టక ముందు..ఆశ్రిత్ పుట్టిన తరువాత.. (వాడి మొదటి అడుగులు ) ఏంటి అంత స్పెషల్ అంటరా.. మా ఇంట్లో వ...