టీమిండియా తీన్ మార్ ఆడుతుందా?

నాకౌట్ వీరులు నెగ్గేదెవరు? ఎన్నో అంచనాలు .. మరెన్నో ఆసక్తికర పోరాటలతో రసవత్తరంగా సాగిన వరల్డ్ లీగ్ దశ ముగిసింది . టోర్నీలో మొత్తం 14 జట్లు బరిలో దిగితే .. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఎనిమిది జట్లూ నాకౌట్ పోరుకు అర్హత సాధించాయి . ఇక డూ ఆర్ డై తేల్చుకునేందుకు సై అంటై సై అంటున్నాయి .. ప్రస్తుతం ఎనిమిది జట్లు బరిలో ఉన్నా కేవలం ఐదు జట్లనే అసలైన ఫేవరెట్లుగా అభిమానులు అంచనా వేస్తున్నారు . టీమిండియా మూడో సారి కప్ నెగ్గి తీన్ మార్ ఆడుతుందని .. ఆసీస్ ఐదో వరల్డ్ కప్ నెగ్గి పంచ్ పవర్ రుచి చూపిస్తుందని .. మరో ఆతిథ్య కివీస్ తొలి వరల్డ్ కప్‌ను ముద్దాడుతుందని .. సంగక్కర సూపర్ ఫాం లంకకు కప్ అందిస్తుందని .. సఫారీ టీం లక్ ఈ సారైనా మారొచ్చని .. ఇలా అంతా ఎ...