మాస్టర్ లేని ముంబై
      మాస్టర్ లేని ముంబై...         విక్టరీలు వెనకడుగేస్తున్నాయి... పరాజయాలు వెక్కిరిస్తున్నాయి. మాస్టర్ బ్లాస్టర్ లేని ఇండియన్స్ దగ్గరకు చేరేందుకు మొహమాట పడుతున్నాయి... ఔను ముంబైలో క్రికెట్ దేవుడు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.   అందుకే ముంబై ఈ సీజన్ లో ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో ఓడిన ఏకైక జట్టుగా నిలిచింది....               ఇండియన్  ప్రిమియర్  లీగ్  ఫేవరెట్  జట్లలో  ముంబై  ఇండియన్స్  ఒకటి . ప్రతి  ఏడాది  ఇండియన్స్  పై  భారీ  అంచనాలు  ఉంటున్నాయి . గత  సీజన్  వరకు  దాదాపు  ప్రతి  సారి  ముంబై  అదుర్స్  అనిపించింది . ఈ  ఏడాది  సీన్  రివర్స్  అయ్యింది . తొలి  రెండు  సీజన్లలో  పేలవ  ప్రదర్శన  చేసిన  తరువాత  పుంజుకుంది  ముంబై ... వయసు  మీద  పడినా .. సచిన్  తమ  జట్టులో  ఉన్నాడన్న  ఒక్క  భరోసాతో  ముంబై  చెలరేగుతూ  వచ్చింది . 2010 లో  ఫైనల్  కు  చేరుకొని  సత్తా  చాటింది ... 2011 లో  ప్లే  ఆఫ్  కు  అర్హత  సాధిచింది . 2012 లో  అదే  ప్రదర్శన  పునరావృతం  చేసి  ప్లే  ఆప్  కు  అర్హత  సాధిచింది . ఇక  2013 లో  ముంబై  ఇంకాస్త  చెలరేగింది . ఛాంపియన్  గా  నిలిచింది . సచిన్  పెద్దగా  రాణించక...